ADB: నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ మెస్రం మాధవరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయాన్నీ తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.