ప్రకాశం: కంభం పట్టణంలో ఎస్సై నరసింహారావు బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.