ASF: రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రణాళిక నిధులు వరంగా మారాయని జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాధ్ అన్నారు. బుధవారం జైనూర్ మండలంలోని రామనాయక్ తండాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో రూ.15 లక్షలతో చేపట్టిన మురుగు కాలువలు రహదారుల నిర్మాణాలను త్వరలో పూర్తి చేయాలన్నారు.