GDWL: జిల్లా కేంద్రంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ ఈరోజు సందర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిత్యం స్లాట్ బుకింగ్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నరన్నారు. స్లాట్ బుకింగ్‌ను నిరంతరం ఏర్పాటు చేసి డెలివరీ తేదీలను ఖరారు చేసేందకు చర్యలు తీసుకోవాలని కోరారు.