SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఆమె ఆలయం ఆవరణలో క్యూ లైన్లు, లడ్డు ప్రసాదాల విక్రయం కౌంటర్లు పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం త్వరితగతిన జరిగే విధంగా క్యూలైన్లు క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.