NLR: రాళ్ళపాడు రిజర్వాయర్లో ప్రస్తుతం 1.06 టీఎంసీల నీరు ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. జలాశయం గరిష్ట నీటి నిల్వ 1.106 టీఎంసీలు కాగా ప్రస్తుతం 95.81% నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ ఇన్ ఫ్లో 40 క్యూసెక్కులు ఉండగా సాగునీరు, మంచినీటి పథకాల కోసం 112 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.