KNR: ప్రతి హిందువు భగవద్గీత నేర్చుకోవాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించాలని శ్రీ త్రిదండి దేవనాథ్ రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు. చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక చింతన, ప్రవచనాలను వివరించారు. ప్రతి రోజు భగవద్గీతలోని 2 శ్లోకాలను నేర్చుకోవాలన్నారు.