NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని కంచుకోటలో నివాసం ఉంటున్న కావలి నరేష్ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి భారీగా దోచుకెళ్లారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి గొలుసులు, రూ.15 వేల నగదును అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇవాళ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.