కోనసీమ: కొత్త ఏడాది వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని యానాం ఎస్పీ వరదరాజన్ గురువారం హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి యానం వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ. 10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు.