కోనసీమ: పేద మహిళలు కట్టెల పొయ్యి దగ్గర ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టారని మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా అన్నారు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో ఉజ్వల యోజన ద్వారా వచ్చిన గ్యాస్ కనెక్షన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.