TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్‌ను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను.. రాధాకిషన్ రావు బెదిరింపులపై ఆరా తీశారు. తన దగ్గరున్న ఆధారాలన్నీ సిట్‌కు అందించానని నందకుమార్ తెలిపారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.