E.G: దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలోని ఎయిడెడ్ పాఠశాల పైకప్పు పాడవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు రాంబాబు బీజేపీ నేత, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన పాఠశాల మరమ్మతులకు రూ.50,000 చెక్కును గురువారం అందించారు.