ELR: చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన కళ్లేపల్లి వెంకటేశ్వరరావుకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 3,01,103 ఎల్ఎసీని మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. మెదడు శస్త్రచికిత్స కోసం ఈ ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి సాయం అందించడంలో మంత్రి కృషి అభినందనీయమని మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు కొనియాడారు.