TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. మావోయిస్టుల భయంతోనే హరీష్ రావు తనతో మాట్లాడారని, రీ-ఎంప్లాయిమెంట్ గురించి కేసీఆర్ను అడగాలని ఆయన వ్యాఖ్యానించారు. తాను చట్టప్రకారమే నడుచుకున్నానని, ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు, జనవరి 5 తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైంది.