VZM: వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఈనెల 30వ తేదీన రామతీర్థంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్టు రామతీర్థం సేవా పరిషత్ వ్యవస్థాపకులు జ్యోతిప్రసాద్ తెలిపారు. సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలోప్రతీ ఏటా జరిగే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఈసారీ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ఆలయ అర్చకులు కరపత్రాలు ఆవిష్కరించారు.