TG: మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బ్యారేజీని కూల్చడానికి కుట్ర జరిగిందని, మాజీ సీఎం KCRను బద్నాం చేయడానికే ఇలా చేశారని మండిపడ్డారు. చెక్ డ్యామ్ల కూల్చివేతలు చూస్తుంటే తమ అనుమానాలు బలపడుతున్నాయన్నారు. అది పేల్చివేత కాకపోతే.. నిర్మాణ సంస్థతో రిపేర్లు ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నీ బయటపెడతామన్నారు.