NLR: అనకాపల్లి జిల్లా AP రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజుపై పిడి యాక్ట్ ప్రయోగించి అరెస్టు చేయడంపై నెల్లూరు జిల్లా రైతు సంఘం సంయుక్త కార్యదర్శి కృష్ణ ప్రసాద్ ఖండించారు. AP రైతు సంఘం రైతుల క్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. రైతుల పక్షాన నిలిచినందుకు వారిపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేయడం సరి కాదని తెలిపారు. వెంటనే వారిని విడుదల చేయాలని కోరారు.