కర్ణాటకలోని బెళగావిలో ఓ అరుదైన మఠం ఉంది. దేశ్నూర్ గ్రామంలోని ‘స్నానిక అరులప్పనవర విరక్త మఠం’ 70 ఏళ్లుగా మతసామరస్యాన్ని చాటుతోంది. ఇక్కడ శివలింగంతో పాటు ఏసుక్రీస్తునూ పూజిస్తారు. పూజారులు కాషాయం కట్టుకుని, మెడలో రుద్రాక్షలతో పాటు శిలువ ధరించడం ఇక్కడి ప్రత్యేకత. హిందూ, క్రైస్తవ సంప్రదాయాలు రెండూ పాటిస్తూ.. ఎలాంటి గొడవలు లేకుండా ఈ మఠం ఆదర్శంగా నిలుస్తోంది.