MBNR: నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో వాళ్లకు చెప్పుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని తెలిపారు. పది సంవత్సరాల మీ పాలన గురించి గుర్తు చేసుకోవాలన్నారు.