VSP: మహా నగరం విశాఖ శరవేగంగా విస్తరిస్తుంది. జీవీఎంసీ పరిధిలో జోన్ల పునర్వ్యవస్థీకరణ పూరైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న ఎనిమిది జోన్లను పది జోన్లుగా విభజించారు. అగనంపూడి, మర్రిపాలెం వద్ద రెండు జోన్లను ఏర్పాటు చేశారు. జనవరి 1 నుంచి అమలు అయ్యే విధంగా జీవీఎంసి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.