ప్రపంచ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఫ్రాంఛైజీ ‘అవతార్’. 2009లో మొదలైన ఈ సిరీస్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ కాగా.. సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే ఈ మూడు మూవీలు ఇప్పటివరకు ఏకంగా 5.6 బిలియన్ డాలర్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇంకా ‘అవతార్ 3’ థియేటర్లలో రన్ అవుతుండటంతో.. ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.