క్రిస్మస్, వీకెండ్ సెలవుల నేపథ్యంలో జనం సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ నెలకొంది. రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. అటు 6 లేన్ల రోడ్డు విస్తరణ పనుల కారణంగా చౌటుప్పల్, చిట్యాల, పంతంగి తదితర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు.