ADB: నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంలోని విధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఇవాళ అంకిత రాజునాయక్ కార్మికులతో కలిసి తొలగింపజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాలను స్వచ్ఛంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరించే చర్యలు తీసుకుంటామన్నారు.