MDK: కొల్చారం మండలం పరిధిలో ఏడుపాయల శివారులో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి (సుమారు వయసు 50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాలు విరిగి, మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.