MDCL: మల్కాజ్గిరి జోనల్ కమిషనర్గా సంచిత్ గంగ్వార్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు ఇంఛార్జి ఉప కమిషనర్ నాయక్, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం జోనల్ కార్యాలయంగా మారడంతో కార్యాలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు.