నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే నెల 5న రూ.4.85 కోట్ల నిధులతో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు టీడీపీ నేత గిరిధర్ రెడ్డి తెలిపారు. పొట్టేపాలెం కలుజు ప్రాంతాన్ని ఆర్&బీ, ఇరిగేషన్, సర్వేయర్, రెవెన్యూ అధికారులతో ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా భావించి పనిచేస్తున్నామన్నారు.