W.G: తాడేపల్లిగూడెం సీపీఐ కార్యాలయంలో పార్టీ శత జయంతి ఉత్సవాలు శుక్రవారం నిర్వహించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ కొనసాగుతుందన్నారు. చల్లపల్లి జమిందార్ భూములు పేదలకు పంచిన ఘనత సీపీఐకే దక్కుతుందన్నారు. సీపీఐ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తుందన్నారు.