విశాఖ కేజీహెచ్‌లో నకిలీ డాక్టర్‌గా నటిస్తూ కిడ్నీ బాధిత కుటుంబాన్ని మోసం చేసిన ప్రవీణ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కిడ్నీ చికిత్స పేరుతో బాధితులను నమ్మించి రూ.లక్ష మేర నగదు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రవీణ్, జ్యోతి శివశ్రీ అనే పేరుతో కూడా వ్యవహరిస్తూ, గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.