VKB: పరిగి మున్సిపాలిటీనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ బీసీ కాలనీలో రూ.9 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇవి టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు.