WGL: చెన్నారావుపేట మండలం లింగాపురంలో పల్నాటి సబిత (35) విద్యుత్ షాక్తో శుక్రవారం మరణించారు. తాను నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటికి నీరు పడుతుండగా, విద్యుత్ మోటర్ ఆగిపోయింది. దానిని సరి చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సబిత భర్త లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.