శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో షఫాలీ వర్మ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగింది. కేవలం 24 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఆమె 50 పరుగులు పూర్తి చేసుకుంది. షఫాలీ ధాటికి భారత్ 6 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కాగా, గత మ్యాచ్లోనూ ఆమె 34 బంతుల్లో 69 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన విషయం తెలిసిందే.