రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వచ్చే 5 ఏళ్లలో రైళ్ల కెపాసిటీని డబుల్ చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. దేశవ్యాప్తంగా 48 నగరాలను ఎంచుకోగా.. ఇందులో మన హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా తిరుపతి ఉన్నాయి. 2030 నాటికి కొత్త ప్లాట్ఫారాలు, టర్మినల్స్ నిర్మించి రద్దీకి చెక్ పెట్టనున్నారు. మౌలిక సదుపాయాలు పెంచి, వెయిటింగ్ లిస్ట్ బాధలు తగ్గించడమే దీని టార్గెట్.