AP: వైజాగ్ రంగానాడు సభలో వంగవీటి రంగా కూతురు ఆశా సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా కేవలం బెజవాడ బెబ్బులి కాదు.. ఆంధ్రా బెబ్బులి అని నినదించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, రాధారంగా మిత్ర మండలికి మళ్లీ ప్రాణం పోస్తానని స్పష్టం చేశారు. తనను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎంత తొక్కితే అంత ఉప్పెనలా ముందుకొస్తానని ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.