VKB: ఈనెల 27, 28, 29 తేదీల్లో హజ్రత్ అలాం షాహిద్ హజ్రత్ హుస్సేన్ షాహిద్ దర్గా ఉర్సు ఉత్సవాలను నిర్వహిస్తామని మజీద్ ఉత్సవ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉర్సు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.