KDP: ఆర్జెడి హయాంలో ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, టీచర్ల బదిలీలు, ఎయిడెడ్ పోస్టుల భర్తీలో భారీగా అవినీతి జరుగుతోందని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ ఆరోపించారు. ఈ అవినీతిని ప్రశ్నించిన PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, మరో ముగ్గురిపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన శుక్రవారం కడపలో డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.