HNK: కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్‌లో అక్రమంగా చైనా మంజా విక్రయిస్తున్న సమచారం మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి గారిగే శివకృష్ణ వద్ద నుంచి 180 చైనా మంజా చిన్న ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మంజా విలువ రూ. 9,000గా గుర్తించి కేసు నమోదు నిమిత్తం కాజీపేట పోలీసులకు అప్పగించినట్లు ఎసీపీ మధుసూదన్ తెలిపారు.