MDK: తూప్రాన్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ ధర్మ శాస్త్ర తిరు కళ్యాణ మహోత్సవ, మండల పూజ ఘనంగా నిర్వహించారు. రాత్రి తూప్రాన్ పట్టణంలో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. గురుస్వాములు నేతి మహేశ్వర్, చిన్న లింగు శ్రీనివాస్, బజార్ రూపేష్, బసవన్నగారి సత్యనారాయణ గౌడ్, మాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.