NRML: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహిస్తున్న న్యాయవాద పరిషత్ 17వ జాతీయ సదస్సులో నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేర్ నరేందర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర వంటి పలు అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి చర్చించామన్నారు.