MNCL: మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని జన్నారం మండల ఎస్సై అనూష కోరారు. శుక్రవారం జన్నారం మండలంలోని ఇందన్ పల్లి అనుబంధ నాయకపు గూడెంలో ఆదివాసి, గిరిజన మహిళలు వెదురు బొంగులతో చేసిన పరికరాలను, కుర్చీలను అమె పరిశీలించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.