టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో 3 వికెట్లు తీయడం ద్వారా, T20Iల్లో 150 వికెట్లు పూర్తి చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్‌గా.. ఆస్ట్రేలియా ప్లేయర్ మేగన్(151 వికెట్లు) రికార్డ్‌ను సమం చేసింది.