విశాఖ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ-2026 శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “జర్నలిస్టులు వాస్తవ కథనాలు రాయాలి, కలం బలాన్ని సద్వినియోగం చేయాలి” అన్నారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, శిక్షణ, రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ తెలిపారు.