WNP: ఆత్మకూరు మండలం ఖానాపురంకి చెందిన చంద్రకళ శంషాబాద్ జోనల్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయంపై ఖానాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె పని చేసిన ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని గుర్తు చేసుకున్నారు. తమ గ్రామ బిడ్డ ఉన్నత పదవిని చేపట్టడం గర్వకారణమన్నారు.