VSP: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను డిసెంబర్ 31న ముందుగానే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఆ రోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారని చెప్పారు. పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న నగదు డ్రా చేసేందుకు ఆదేశించినట్లు తెలిపారు.