TG: అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి వస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని వచ్చినా.. అప్పటి సీఎం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక మార్పు వచ్చిందన్నారు.