SKLM: జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే తమ లక్ష్యమని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 115 గంజాయి హాట్- స్పాట్లను గుర్తించామని, సరిహద్దుల వద్ద 24 గంటల నిఘా ఉంచామన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపు తామని అన్నారు.