BHPL: మహాదేవపూర్ మండల కేంద్రంలోని GP కార్యాలయ ఆవరణలో శుక్రవారం CI వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాటారం DSP సూర్యనారాయణ హాజరై, మాట్లాడుతూ.. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DSP సూచించారు. ఫోన్ కాల్స్, వాట్సాప్ లింకులు, లాటరీల ద్వారా మోసగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు.