BDK: YERU ది రివర్ ఫెస్టివల్లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటల నుంచి భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. 230 మంది యువతతో ఫ్లాష్ మోబ్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. అనంతరం నదుల సంరక్షణపై అవగాహన కల్పించే నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.