ADB: జిల్లా కేంద్రంలోని రత్నా గార్డెన్స్‌లో శుక్రవారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్‌లకు సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంఛార్జి మంత్రి కృష్ణారావు హాజరయ్యారు. ఆయనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌లకు శాలువాలతో సన్మానం చేసి, గెలుపొందిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.