JGL: నూతన సర్పంచులు కాంగ్రెస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ సర్పంచ్‌గా ఎన్నికైన ఇండిపెండెంట్ అభ్యర్థి రాజశేఖర్ తన అనుచరులతో కలిసి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి పాల్గొన్నారు.