AP: వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 7 కి.మీ టన్నెల్ -2 లైనింగ్ పనుల్లో 3.2 కి.మీ పూర్తయిందని మంత్రి తెలిపారు. ఈ నెలలో 432 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి వెలిగొండ పూర్తి చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.